ముల్లంగి పెసరపప్పు

ABN , First Publish Date - 2018-02-03T21:40:23+05:30 IST

ముల్లంగి- రెండు (తొక్క తీసి సన్నగా తురమాలి), ముల్లంగి ఆకులు- గుప్పెడు (సన్నగా తరిగి), పెసరపప్పు...

ముల్లంగి పెసరపప్పు

కావలసినవి
 
ముల్లంగి- రెండు (తొక్క తీసి సన్నగా తురమాలి), ముల్లంగి ఆకులు- గుప్పెడు (సన్నగా తరిగి), పెసరపప్పు- అర కప్పు (వేడి నీళ్లలో అరగంట నానబెట్టి), లవంగాలు, వెల్లుల్లిపాయలు- ఒక్కోటి నాలుగు, చొప్పున, నూనె- ఒక టేబుల్‌స్పూను, ఆవాలు- ఒక టీస్పూను, జీలకర్ర, పసుపు- ఒక్కోటి అర టీస్పూను చొప్పున, ఇంగువ- పావు టీస్పూను, పచ్చిమిర్చి- నాలుగు (సన్నగా తరిగి), ఉప్పు- తగినంత.
 
తయారీవిధానం
 
లోతైన కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు జీలకర్ర వేయాలి. తర్వాత పాన్‌లో వెల్లుల్లి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి కొన్ని సెకన్లు వేగించాలి. వేడి నీళ్లలో నానబెట్టిన పెసరపప్పును వడకట్టి పాన్‌లో వేసి కలపాలి. ఆ పాన్‌ మీద మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో ముల్లంగి తురుము, ముల్లంగి ఆకుల తరుగు వేయాలి. సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ముల్లంగి మెత్తగా అయ్యేవరకూ అంటే ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఈ కూరను పుల్కాతో తింటే బాగుంటుంది.

Updated Date - 2018-02-03T21:40:23+05:30 IST