ముల్లంగి ఫ్రై

ABN , First Publish Date - 2018-05-19T22:51:04+05:30 IST

ముల్లంగి తరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు, శనగపప్పు - 2 టీ స్పూన్లు, ఆవాలు...

ముల్లంగి ఫ్రై

కావలసిన పదార్థాలు
 
ముల్లంగి తరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు, శనగపప్పు - 2 టీ స్పూన్లు, ఆవాలు- 1/2 టీ స్పూను, జీలకర్రపొడి - 1/2 టీ స్పూను, నూనె - 2 స్పూన్లు, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, గరంమసాలా - తగినంత.
 
తయారుచేసే విధానం
 
పాన్‌లో నూనె వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, సెనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి తాలింపుపెట్టాలి. తర్వాత ముల్లంగి తరుగు వేసి చిన్నమంటపై వేగించాలి. పదినిమిషాల తరువాత తగినంత ఉప్పు, కొబ్బరి తురుము కలిపి మరొక ఐదు నిముషాలు వేగనివ్వాలి. చివరకు తగినంత కారం, గరంమసాలా చల్లి రెండునిమిషాలు వేగించి దించేయాలి. ఈ కూర అన్నంతో లేదా చపాతీతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-05-19T22:51:04+05:30 IST