ఆపిల్‌ జామ్‌

ABN , First Publish Date - 2015-08-29T23:27:31+05:30 IST

కావలసిన పదార్థాలు: తాజా ఆపిల్‌ రసం - 4 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను

ఆపిల్‌ జామ్‌

కావలసిన పదార్థాలు: తాజా ఆపిల్‌ రసం - 4 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: వెడల్పాటి లోతైన కడాయిలో ఆపిల్‌ రసం, పంచదార, నిమ్మరసం వేసి ఒక మోస్తరు మంటపై ఉంచాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంట పెద్దగా చేసి అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ తీగపాకం రాగానే స్టౌవ్‌ కట్టేయాలి. వెంటనే శుభ్రం చేసిన గాజు సీసాలో (కొంత భాగం గాలి ఉండేలా) పోసి మూతపెట్టాలి. గది ఉష్ణోగ్రత లోకి వచ్చాక ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

Updated Date - 2015-08-29T23:27:31+05:30 IST