క్రీమ్‌ కారమిల్‌

ABN , First Publish Date - 2015-08-30T16:43:29+05:30 IST

కావలసినవి: పంచదార - పావుకిలో, క్రీమ్‌- పావుకిలో లేదా 250గ్రా., వెనిలా ఎసెన్స్‌- రెండు టీ స్పూన్‌లు

క్రీమ్‌ కారమిల్‌

కావలసినవి: పంచదార - పావుకిలో, క్రీమ్‌- పావుకిలో లేదా 250గ్రా., వెనిలా ఎసెన్స్‌- రెండు టీ స్పూన్‌లు, పాలు- 425 మి,లీ, గుడ్లు పెద్దవి ఐదు, పచ్చసొనలు రెండు.
తయారీ విధానం
మందపాటి గిన్నెలో 175 గ్రాముల పంచదార నీళ్లు కలపకుండా వేసి బంగారం రంగులోకి మారేంతవరకూ ఉంచండి. దీన్ని కేక్‌ గిన్నెలోకి మార్చి గిన్నెంతటికీ సవూనంగా పట్టేలా కదపండి. తరువాత వేరే గిన్నె తీసుకుని అందులో పాలు, క్రీం రెండూ వేసి మరిగాక దించి పెట్టుకోండి. 20 నిమిషా లు చల్లారనివ్వండి. ఈలోగా గుడ్లని పగులకొట్టి తెల్లసొన, పచ్చ సొన వేటికవే విడిగా గిలక్కొట్టి మిగిలిన పంచదార కూడా వేసి ఆ మిశ్రమాన్ని పాలలో కలపండి. తర్వాత దీన్ని పంచదార వేసి ఉంచిన గిన్నెలోకి మార్చి, ఎసెన్స్‌ కూడా వేసి మూత పెట్టండి. కుక్కర్‌లో గిన్నెకి సగభాగం వచ్చేలా నీళ్లు పోసి 40- 45 నిమిషాల పాటు మిశ్రమం గట్టిపడేంత వరకూ ఉడికించండి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి జాగ్రత్తగా చాకుతో గిన్నెకి అంటుకోకుండా లేపి ప్లేటులో బోర్లా వేసి అలంకరించి ముక్కలు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-30T16:43:29+05:30 IST