చుక్కకూర రొయ్యలు

ABN , First Publish Date - 2015-08-30T17:54:51+05:30 IST

కావలసిన పదార్థాలు : చిన్న రొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకేజి, చుక్కకూర - 4 కట్టలు, ఉల్లిపాయలు - 2

చుక్కకూర రొయ్యలు

కావలసిన పదార్థాలు : చిన్న రొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకేజి, చుక్కకూర - 4 కట్టలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, గరం మసాలా - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట.
తయారుచేసే విధానం: రొయ్యలకు పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పట్టించి అరగంట పాటు ఉంచాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలతో పాటు రొయ్యలను వేసి వేగించాలి. ఐదునిమిషాలు మూతపెట్టి రొయ్యలు మగ్గాక చుక్కకూర తరుగు వేసి కూరని దగ్గరగా ఉడికించుకోవాలి. దించేముందు గరం మసాలాతోపాటు కొత్తిమీరను చల్లుకోవాలి.

Updated Date - 2015-08-30T17:54:51+05:30 IST