దానిమ్మ జామ్‌

ABN , First Publish Date - 2015-08-30T19:03:06+05:30 IST

కావలసిన పదార్థాలు: దానిమ్మ రసం - మూడున్నర కప్పులు, దానిమ్మ గింజలు - అరకప్పు

దానిమ్మ జామ్‌

కావలసిన పదార్థాలు: దానిమ్మ రసం - మూడున్నర కప్పులు, దానిమ్మ గింజలు - అరకప్పు, పంచదార - 3 కప్పులు, నిమ్మరసం - ఒక కాయది.
తయారుచేసే విధానం: దానిమ్మ గింజల్ని మిక్సీలో తిప్పి వడకట్టినా, లేదా గింజల్ని వేళ్లతో ఒత్తి రసం తీసినా పర్వాలేదు. రసాన్ని ఒక పాత్రలో వేసి పంచదార కలిపి చిన్నమంటపై ఉంచాలి. లేత పాకం రాగానే దానిమ్మ గింజలతో పాటు నిమ్మరసం కలిపి మరో పదినిమిషాలు అడుగంటకుండా తిప్పుతుండాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో నిలవ చేసుకోవచ్చు. బ్రెడ్‌తో తినడానికి బాగుంటుంది.

Updated Date - 2015-08-30T19:03:06+05:30 IST