వంకాయ పిజ్జా

ABN , First Publish Date - 2015-08-31T16:43:22+05:30 IST

కావలసిన పదార్థాలు: వంకాయ - 1, కార్న్‌ఫ్లోర్‌ - 1 కప్పు, గుడ్లు - 3, మిరియాల పొడి - పావు టీ స్పూను, బ్రెడ్‌పొడి

వంకాయ పిజ్జా

కావలసిన పదార్థాలు: వంకాయ - 1, కార్న్‌ఫ్లోర్‌ - 1 కప్పు, గుడ్లు - 3, మిరియాల పొడి - పావు టీ స్పూను, బ్రెడ్‌పొడి - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో (మిరియాలపొడితో పాటు) గుడ్లని గిలకొట్టి ఉంచుకోవాలి. మరో వెడల్పాటి ప్లేట్‌లో బ్రెడ్‌పొడిని వేయాలి. వంకాయల్ని 10 మి.మీ. దళసరి గుండ్రని ముక్కలుగా కోసి రెండు వైపులా కార్న్‌ఫ్లోర్‌ రాయాలి. గిలకొట్టిన గుడ్డు సొన పూసి, బ్రెడ్‌పొడిలో రెండువైపులా పొర్లించాలి. వీటన్నిటినీ ఒక వెడల్పాటి ప్లేటులో సర్ది రిఫ్రిజిరేటర్‌లో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత పెనంపై నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాల్చి ఉప్పుని చల్లుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో (టిఫ్‌న్‌గా) తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-31T16:43:22+05:30 IST