కుకుంబర్స్‌ ఫింగర్స్‌

ABN , First Publish Date - 2015-09-01T17:42:54+05:30 IST

కుకుంబర్స్‌ ఫింగర్స్‌

కుకుంబర్స్‌ ఫింగర్స్‌

కావలసిన పదార్థాలు: దోసకాయలు-2, చికెన్‌ కీమా-ఒక కప్పు అల్లం, వెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్‌ స్పూను, సోయా సాస్‌ - ఒక టీ స్పూను, మొక్కజొన్న పిండి (నీటిలో కలిపింది) - ఒక టీ స్పూను, నూనె - ఒక టేబుల్‌ స్పూను, మిరియాలపొడి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం
ఒక్కో దోసకాయని అడ్డుగా రెండు ముక్కలుగా కోసుకొని, వాటిలోని గుజ్జుని, గింజల్ని తీసి పక్కనుంచుకోవాలి. (చివర్లను పూర్తిగా కోసేయరాదు) కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక నిమిషం పాటు వేగించాక చికెన్‌ కైమాకూడా వేసి ఉడికేదాకా వేగించాలి. చివర్లో సోయాసాస్‌, మిరియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీటిలో కలిపి ఉంచుకున్న మొక్కజొన్న పిండి వేసి బాగా చిక్కబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ పదార్థాన్ని దోసకాయల్లో కూరి వేడిగా, పచ్చి దోసకాయతో పాటే తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-01T17:42:54+05:30 IST