పెసర కూటు

ABN , First Publish Date - 2015-09-01T22:00:46+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, ఆలుగడ్డ

పెసర కూటు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, ఆలుగడ్డ (తొక్కతీసి క్యూబ్స్‌గా కట్‌ చేయాలి) - 1, పసుపు - చిటికెడు, మునక్కాయ అంగుళం ముక్కలు - 6, ఎండుమిర్చి - 5, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు దినుసులు - సరిపడా.
తయారుచేసే విధానం: ఎండుమిర్చి, మినప్పప్పు దోరగా వేగించి, చల్లారిన తర్వాత కొబ్బరి తురుముతో పాటు మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత నీటిలో పెసరపప్పు 3 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. రెండు కప్పుల నీటిలో మునక్కాయ, ఆలు ముక్కలు, పసుపు ఉడికించి కొబ్బరి మిశ్రమం వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఉడికిన పప్పు, ఉప్పు వేసి నిమిషం తర్వాత దించేసి తాలింపు పెట్టుకోవాలి. వేడి అన్నంతో కమ్మటి రుచిగా ఉండే కూటు ఇది.

Updated Date - 2015-09-01T22:00:46+05:30 IST