ప్రాన్స్ బాల్స్
ABN , First Publish Date - 2015-09-01T20:49:31+05:30 IST
కావలసినవి: చిన్నరొయ్యలు - రెండు కప్పులు, శనగపిండి - అరకప్పు, రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు
కావలసినవి: చిన్నరొయ్యలు - రెండు కప్పులు, శనగపిండి - అరకప్పు, రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి), ఒక ఉల్లిపాయ (తరిగినది), అంగుళం అల్లంముక్క (తరిగినది)
రెండు టీ స్పూన్లు కొత్తిమీర(తరిగినది), రెండు పచ్చిమిర్చి (తరిగినది), ఉప్పురుచికి తగినంత, వేగించడానికి నూనె.
తయారీ విధానం
శుభ్రం చేసి ఉంచుకున్న రొయ్యలకి ముక్కలుగా చేసి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు శనగపిండిని కూడా వేసి కలపండి. తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో ఎర్రగా వేగించి వేడివేడిగా వడ్డించండి. ఈ ప్రాన్బాల్స్ని గ్రీన్చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటాయి.