కొత్తిమీర కొబ్బరి కారం

ABN , First Publish Date - 2015-09-01T22:49:07+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి (తురుము) - అర చిప్ప, చింతపండు

కొత్తిమీర కొబ్బరి కారం

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి (తురుము) - అర చిప్ప, చింతపండు - రెండు రెబ్బలు, ఎండుమిర్చి , మినప్పప్పు - 3 టీ స్పూన్లు, మెంతులు - పావు టీ స్పూను, ఆవాలు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి - 6, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - రెండున్నర టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: నూనెలో మినప్పప్పు, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించి పక్కనుంచాలి. మిగిలిన నూనెలో కొత్తిమీర తరుగు వేసి తడి ఇగిరే వరకు వేగించి చింతపండు, పసుపు, ఉప్పు కలపాలి. ముందుగా మిక్సీలో చల్లారిన పోపు దినుసులు వేసి బరకగా పొడి చేసుకుని అందులోనే కొత్తిమీర మిశ్రమం కలిపి రుబ్బాలి. ఈ పేస్టును విడిగా ఉంచిన కొబ్బరి కోరులో కలుపుకోవాలి. ఈ కొత్తిమీర కొబ్బరికారం అన్నంతో పాటు పరాటా, దోశల్లోకి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-09-01T22:49:07+05:30 IST