పచ్చిమిర్చి చట్నీ

ABN , First Publish Date - 2015-09-02T16:00:50+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 200గ్రా., నిమ్మరసం - 50 మి.లీ., కారం - 1 టీ స్పూను

పచ్చిమిర్చి చట్నీ

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 200గ్రా., నిమ్మరసం - 50 మి.లీ., కారం - 1 టీ స్పూను, మెంతులు - అర టేబుల్‌ స్పూను, ఆవాలు - అర టేబుల్‌ స్పూను, పసుపు - 1 టీ స్పూను, వేగించిన జీరాపొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: మెంతులు, ఆవాలు పొడిచేసి అందులో కారం, పసుపు, జీరాపొడి, ఉప్పు కలపాలి. సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని గింజలు తీసేసి నిమ్మరసంలో గంటసేపు నానబెట్టాలి. కాగబెట్టిన నూనెలో పొడుల మిశ్రమాన్ని వేసి అందులో పచ్చిమిర్చిముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ చట్నీని గాజుజాడీలో పెట్టి 5 రోజుల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T16:00:50+05:30 IST