బనానా స్ప్లిట్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-06T13:47:37+05:30 IST

కావలసిన పదార్థాలు : పండిన అరటి పండు-1, పెరుగు-అర కప్పు, దానిమ్మ పండు (చిన్నది)-1, మిరియాలు

బనానా స్ప్లిట్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు : పండిన అరటి పండు-1, పెరుగు-అర కప్పు, దానిమ్మ పండు (చిన్నది)-1, మిరియాలు-ఒక టీస్పూన్‌, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : అరటి పండును ఒలిచి పైనుంచి కింది వరకు రెండు బద్దలుగా చీల్చి ప్లేటులో పెట్టుకోవాలి. పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్‌పైన పెట్టి కొద్దిసేపు వేడిచేసి ప్లేటులో ఉన్న అరటి పండు బద్దలపై పోయాలి. చుట్టూ ఎర్రటి దానిమ్మగింజలు చల్లాలి. పైన తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లుకోవాలి.

Updated Date - 2015-11-06T13:47:37+05:30 IST