వాటర్ మెలన్ ఫ్రీజీ

ABN , First Publish Date - 2016-04-27T20:15:51+05:30 IST

కావలసిన పదార్ధాలు: పుచ్చకాయ ముక్కలు - 4 కప్పులు, పంచదార - అరకప్పు, చెర్రీ జిలాటిన - ఒక కప్పు, పెరుగు - ఒక కప్పు, వేడినీళ్లు - పావుకప్పు

వాటర్ మెలన్ ఫ్రీజీ

కావలసిన పదార్ధాలు: పుచ్చకాయ ముక్కలు - 4 కప్పులు, పంచదార - అరకప్పు, చెర్రీ జిలాటిన - ఒక కప్పు, పెరుగు - ఒక కప్పు, వేడినీళ్లు - పావుకప్పు
 
తయారీ విధానం: ఒక గిన్నెలో చెర్రీ జిలాటిన, పంచదార వేసి కలపాలి. ఇందులో వేడినీళ్ళు పోసి పంచదార కరిగేవరకు అలాగే ఉంచాలి. ఈలోపు పుచ్చకాయ ముక్కలను గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ ప్యూరీ జిలాటిన మిశ్రమంలో వేసి కలపాలి. ఇందులోనే పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. గిన్నెలోకి గాలి పోకుండా జాగ్రత్తపడితే తొందరగా గడ్డకడుతుంది. ఇంకేముంది, రుచికరమైన వాటర్‌మెలన ఫ్రిజీ మీ నోరూరించక మానదిక!

Updated Date - 2016-04-27T20:15:51+05:30 IST