వాటర్‌మెలన్- స్ట్రాబెర్రీ స్మూతీ

ABN , First Publish Date - 2016-04-27T20:34:25+05:30 IST

కావలసిన పదార్ధాలు: స్ట్రాబెర్రీస్ - ఒక కప్పు, పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు, యాలకులు - 2 లేదా 3, మిరియాల పొడి - చిటికెడు, పంచదార - అర కప్పు, ఐస్‌క్యూబ్స్‌ - సరిపడా.

వాటర్‌మెలన్- స్ట్రాబెర్రీ స్మూతీ

కావలసిన పదార్ధాలు: స్ట్రాబెర్రీస్ - ఒక కప్పు, పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు, యాలకులు - 2 లేదా 3, మిరియాల పొడి - చిటికెడు, పంచదార - అర కప్పు, ఐస్‌క్యూబ్స్‌ - సరిపడా.
 
తయారీ విధానం: ముందుగా పుచ్చకాయను స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిలోని విత్తనాలు తొలగించాలి. తరువాత ఈ పండ్ల ముక్కలను మిక్సీ జార్‌లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి గ్రైండ్‌ చేయాలి. తరువాత ఈ స్మూతీని ఒక గిన్నెలోకి తీసుకుని బయట అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతీని మిక్సీజార్‌లో వేసి, స్మూతీతోపాటు ఐస్‌ క్యూబ్స్‌, యాలకులు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. తర్వాత దాన్ని సర్వింగ్‌ గ్లాసులోకి మార్చు కుని చిటికెడు మిరియాలపొడి చిలక రించి కూల్‌ కూల్‌గా సర్వ్‌ చేయడమే ఆలస్యం.

Updated Date - 2016-04-27T20:34:25+05:30 IST