చికెన్‌ హలీమ్‌

ABN , First Publish Date - 2018-05-26T21:24:29+05:30 IST

చికెన్‌- 750 గ్రాములు, అల్లం-వెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు-అర కప్పు (సన్నగా తరిగి), గులాబీ రెక్కలు...

చికెన్‌ హలీమ్‌

కావలసినవి
 
చికెన్‌- 750 గ్రాములు, అల్లం-వెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు-అర కప్పు (సన్నగా తరిగి), గులాబీ రెక్కలు-పావు కప్పు, పచ్చిమిర్చి-ఐదు, నెయ్యి-అరకప్పు, గోధుమరవ్వ-అర కప్పు, ఓట్స్‌-పావు కప్పు, బాదంపప్పులు-ఆరు, శెనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు-ఒక్కొక్కటీ ఒక్కో స్పూను, నువ్వులు-మూడు గ్రాములు, జీలకర్ర-నాలుగు గ్రాములు, లవంగాలు-రెండు గ్రాములు, మిరియాలు-మూడు గ్రాములు, దాల్చినచెక్క-రెండు అంగుళాల ముక్క, యాలకులు-ఎనిమిది, సాజీరా- రెండు గ్రాములు, కబాబ్‌చినీ-రెండు గ్రాములు, పాలు-ఒక కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, వేగించిన ఉల్లిపాయముక్కలు-అర కప్పు, పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు (ఛాయిస్‌), కొత్తిమీర-అరకట్ట (తరుగు), పుదీనా-అర కట్ట (తరుగు).
 
తయారీవిధానం
 
వెడల్పాటి గిన్నెలో కబాబ్‌ చినీ, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, పెసరపప్పు, మినపప్పు, శెనగపప్పు, ఎర్ర కందిపప్పు, బాదం, ఓట్స్‌, గోధుమరవ్వ అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిచేయాలి.
ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. చికెన్‌ ముక్కలతో పాటు చికెన్‌ను నానబెట్టిన నీళ్లను కూడా అందులో పోసి కలపాలి. ఈ మిశ్రమంలో వేగించిన ఉల్లిపాయముక్కలు, గులాబిరెక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు, ఉప్పు, రెడీచేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి. పెద్దమంటపై రెండు విజిల్స్‌ వచ్చేదాకా ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఆతర్వాత సన్నని మంటపై 40 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పొటాటో మాషర్‌ తీసుకుని దాన్ని మెత్తగా పేస్టులా చేయాలి. అందులో నెయ్యి వేసి కలపి, దానిపై నిమ్మరసం చల్లి వేడిగా తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-05-26T21:24:29+05:30 IST