కొబ్బరి, బొప్పాయి డ్రింక్‌

ABN , First Publish Date - 2018-05-30T18:33:48+05:30 IST

కొబ్బరి పాలు - ఒక కప్పు, బొప్పాయి ముక్కలు - మూడుకప్పులు (ఫ్రిజ్‌లో పెట్టి తీసినవి), పంచదార...

కొబ్బరి, బొప్పాయి డ్రింక్‌

కావలసినవి
 
కొబ్బరి పాలు - ఒక కప్పు, బొప్పాయి ముక్కలు - మూడుకప్పులు (ఫ్రిజ్‌లో పెట్టి తీసినవి), పంచదార - అరకప్పు, ఐస్‌క్యూబ్స్‌ - ఒకటిన్నర కప్పులు.
 
తయారీవిధానం
 
కొబ్బరిపాలు, బొప్పాయి, పంచదార, ఐస్‌క్యూబ్స్‌ బ్లెండర్‌లో వేసి మెత్తగా, నురగ వచ్చే వరకు గ్రైండ్‌ చేయాలి. ఈ కొలతలతో నాలుగు గ్లాసులకు సరిపోను జ్యూస్‌ తయారవుతుంది. తయారుచేసిన వెంటనే తాగితే మండు వేసవిలో చల్లగా ఉంటుంది. తాజాగా అనిపిస్తుంది.

Updated Date - 2018-05-30T18:33:48+05:30 IST