ఉసిరికాయ సబ్జీ

ABN , First Publish Date - 2019-11-11T18:09:38+05:30 IST

ఉసిరికాయలు - ఒక కప్పు(గింజలు తీసి, చిన్నగా కట్‌ చేసినవి), ఆవాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఆవాల నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర -

ఉసిరికాయ సబ్జీ

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కప్పు(గింజలు తీసి, చిన్నగా కట్‌ చేసినవి), ఆవాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఆవాల నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపయ్యాక ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి. కారం, పసుపు, సోంపు, ధనియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరువాత అరకప్పు నీళ్లు, బెల్లం వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. అన్నంలోకి లేదా చపాతీలోకి ఈ సబ్జీ రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-11-11T18:09:38+05:30 IST