ఫ్రూట్‌ జిలేబి

ABN , First Publish Date - 2015-09-01T22:54:48+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆపిల్‌ - 1, ఫైనాపిల్‌ - అరపండు, జామ - 1, అరటి - 2,

ఫ్రూట్‌ జిలేబి

కావలసిన పదార్థాలు: ఆపిల్‌ - 1, ఫైనాపిల్‌ - అరపండు, జామ - 1, అరటి - 2, బేరి - 1 మైదా - 250 గ్రాములు, నీరు - 300 గ్రాములు, వంటసోడా - చిటికెడు, వేగించడానికి సరిపడా నూనె.
తయారుచేసే విధానం: సగం మైదాని సగం నీటిలో కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. జిలేబీ తయారుచేసేముందుగా మిగతా మైదాలో మిగతా నీటిని కలుపుకొని, ఈ తర్వాత రెండిటినీ ఒకే పాత్రలో వేసి కలుపుకోవాలి. తినే సోడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు చక్రాల్లా తరిగిన పండ్ల ముక్కల్ని మైదాలో ముంచి కడాయిలో నూనె వేడెక్కాక రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేగిం చాలి. వీటిపై తేనెను చిలకరించుకుని తింటే చాలా బాగుంటాయి.

Updated Date - 2015-09-01T22:54:48+05:30 IST