పియర్స్‌ కిస్‌మిస్‌ పచ్చడి

ABN , First Publish Date - 2015-09-02T16:10:14+05:30 IST

కావలసినవి: పియర్స్‌ - ఒక కిలో, ఉల్లిపాయ- 350 గ్రాములు, అల్లం- 30 గ్రాములు, నిమ్మరసం

పియర్స్‌ కిస్‌మిస్‌ పచ్చడి

కావలసినవి: పియర్స్‌ - ఒక కిలో, ఉల్లిపాయ- 350 గ్రాములు, అల్లం- 30 గ్రాములు, నిమ్మరసం - 100 మిల్లీ., పంచదార- కిలో 800 గ్రాములు, వైట్‌ వెనిగర్‌- రెండున్నర లీటర్లు, జీలకర్ర- 100 గ్రాములు, వెల్లుల్లి- 50 గ్రాములు, నల్ల జీలకర్ర కొద్దిగా, నూనె కొంచెం.
తయారీ విధానం:
ఉల్లిపాయలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి ఉంచుకోండి. పియర్స్‌ని కడిగి మందపాటి ముక్కలు చేసుకోండి. పెద్దగిన్నె తీసుకుని పియర్స్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కిస్‌మిస్‌లు, అల్లం, వెల్లుల్లి, పంచదార వేసి వాటికి వైట్‌ వెనిగర్‌ని చేర్చి ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగి , చట్నీ పూర్తిగా చిక్కబడిందాక కలియతిపతూ ఉండాలి. పచ్చడి దగ్గరకి వచ్చిన తరువాత జీలకర్రని నూనెలో వేగించి అలంకరించుకోవాలి. చల్లారిన తరువాత నిమ్మరసాన్ని కూడా చేర్చి సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో నిలువచేసుకోవాలి.

Updated Date - 2015-09-02T16:10:14+05:30 IST