కొబ్బరి హల్వా

ABN , First Publish Date - 2015-09-02T18:54:08+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, (ముదిరిన) కొబ్బరికాయ - 1, పంచదార/ (తరిగిన) తెల్లబెల్లం - పావుకిలో,

కొబ్బరి హల్వా

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, (ముదిరిన) కొబ్బరికాయ - 1, పంచదార/ (తరిగిన) తెల్లబెల్లం - పావుకిలో, నెయ్యి - 100 గ్రా., ఏలకులు - 5 గ్రా., జీడిపప్పు- 30 గ్రా., బాదం - 10 పప్పులు., మిఠాయిరంగు - చిటికెడు.
తయారుచేసే విధానం: బియ్యం శుభ్రంగా కడిగి 2 గంటలపాటు నానబెట్టాలి. బాదం పప్పుని పది నిమిషాల పాటు నీళ్లల్లో నానబెడ్తే తొక్క వచ్చేస్తుంది. తర్వాత సన్నగా పొడుగ్గా ముక్కల్లా కోసుకోవాలి. జీడిపప్పును, బాదం ముక్కల్ని నేతిలో దోరగా వేగించి పక్కనుంచాలి. కొబ్బరిని తురుముకొని, బియ్యంతో పాటు మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. కడాయిలో పంచదార/బెల్లంతో పాటు కొద్దిగా నీరు పొసి తీగపాకం వచ్చాక కొబ్బరి మిశ్రమం వేసి తిప్పాలి. తర్వాత నెయ్యి వేసి గరిటతో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.(ఇష్టమున్నవాళ్లు మిఠాయిరంగు వేసుకోవచ్చు). కాసేపటికి పిండి దగ్గర పడి చేతికి అంటుకోకుండా తయారయ్యాక యాలకుల పొడి వేసి దించేయాలి. నెయ్యి రాసిన పళ్లెంలో బోర్లించి చదరంగా సర్ది పైన జీడిపప్పు, బాదం అలంకరించాలి.

Updated Date - 2015-09-02T18:54:08+05:30 IST