ఓట్స్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:33:08+05:30 IST

కావలసిన పదార్థాలు: ఓట్స్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, బీన్స్‌ - 15, క్యారెట్‌ - 1, పచ్చి బఠాణీలు - పావు కప్పు

ఓట్స్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: ఓట్స్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, బీన్స్‌ - 15, క్యారెట్‌ - 1, పచ్చి బఠాణీలు - పావు కప్పు, స్వీట్‌ కార్న్‌ - పావు కప్పు, పాలు - అర కప్పు, పెప్పర్‌ - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - పావు టీ స్పూను, కొత్తిమీర - అర టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: కప్పు నీటిలో ముక్కలుగా తరిగిన క్యారెట్‌, బీన్స్‌ని ఉడికించి దించేయాలి. మరో కడాయిలో అరకప్పు నీటిని పోసి, ఉడికిన ముక్కలతో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్‌లు వేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఓట్స్‌ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి (మరీ చిక్కబడితే అరకప్పు నీటిని కలుపుకోవచ్చు). పెప్పర్‌, ఉప్పు, పంచదార వేసి ఒక నిమిషం తర్వాత పాలు కలిపి దించేయాలి. ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర చల్లి తాగండి.

Updated Date - 2015-09-02T22:33:08+05:30 IST