పాలక్‌ మష్రూమ్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:34:42+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, వెల్లుల్లి - 6 రేకలు, మష్రూమ్స్‌ - 100 గ్రా., ఉప్పు, మిరియాలపొడి

పాలక్‌ మష్రూమ్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, వెల్లుల్లి - 6 రేకలు, మష్రూమ్స్‌ - 100 గ్రా., ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, పాలు - అరకప్పు, జాజికాయ పొడి - అర టీ స్పూను, బటర్‌ లేదా నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: బటర్‌/ నెయ్యిలో తరిగిన వెల్లుల్లిని సన్నటి మంటపై దోరగా వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన మష్రూమ్స్‌ వేసి, నీరు ఆవిరై, గట్టిపడేవరకు వేగించాలి. ఇప్పుడు ఆవిరిపై ఉడికించి గ్రైండ్‌ చేసిన పాలకూర ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించాలి. పాలు పోసి, జాజికాయ పొడి చల్లి మూతపెట్టి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. సర్వ్‌ చేసేముందు సూప్‌పైన క్రీమ్‌తో గార్నిష్‌ చేయండి.

Updated Date - 2015-09-02T22:34:42+05:30 IST