తాటిపండు హల్వా

ABN , First Publish Date - 2016-07-25T19:00:20+05:30 IST

కావలసిన పదార్థాలు: తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌- 1/2 కప్పు, నీళ్ళు- 1/2 కప్పు, పంచదార- 1/2 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్‌- 1/4 కప్పు

తాటిపండు హల్వా

కావలసిన పదార్థాలు: తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌- 1/2 కప్పు, నీళ్ళు- 1/2 కప్పు, పంచదార- 1/2 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్‌- 1/4 కప్పు, నెయ్యి- 1 టేబుల్‌ స్పూను, ఉప్పు- చిటికెడు.
 
తయారీ విధానం: కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి. తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌, పంచదార, డ్రై ఫ్రూట్స్‌, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.

Updated Date - 2016-07-25T19:00:20+05:30 IST