గసగసాల పాయసం

ABN , First Publish Date - 2016-08-29T19:24:03+05:30 IST

గసగసాలు- అర కప్పు, బియ్యం- ఒక టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి తురుము- అర కప్పు, బెల్లం తురుము- అర కప్పు, పాలు- ఒకటిన్నర కప్పు,

గసగసాల పాయసం

కావలసిన పదార్థాలు: గసగసాలు- అర కప్పు, బియ్యం- ఒక టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి తురుము- అర కప్పు, బెల్లం తురుము- అర కప్పు, పాలు- ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి- అర టీ స్పూను, నీళ్లు- తగినన్ని, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని.

 
తయారీ విధానం: గసగసాలను ముదురు రంగు వచ్చేదాకా బాగా వేగించాలి. తర్వాత నీటిలో అరగంటసేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేరేగా అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం, గసగసాలు, కొబ్బరి తురుము కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత బెల్లాన్ని పాకం పట్టి, ఇందులో వేసి బాగా కలిపి మరో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దించేసి పాలు, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు వేసి బాగా కలపాలి.

Updated Date - 2016-08-29T19:24:03+05:30 IST