పాలకూర సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:37:25+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, వెన్న - 1 టేబుల్‌ స్పూను

పాలకూర సూప్‌

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, వెన్న - 1 టేబుల్‌ స్పూను, మిరియాల పొడి, ఉప్పు - రుచికి తగినంత, మసూర్‌ దాల్‌ (ఎర్రపప్పు) - అరకప్పు, పనీర్‌ తురుము - టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: మసూర్‌ దాల్‌ మెత్తగా ఉడికించి, మెదిపి, కప్పు నీటిని కలిపి 2 నిమిషాలు మరిగించి పక్కనుంచాలి. బటర్‌ కరిగించి ఉల్లి, టమోటా, పాలకూర తరుగు ఒకటి తర్వాత ఒకటి మెత్తబడేవరకు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. పప్పు, పాలక్‌ మిశ్రమం, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరిగించాలి. తాగే ముందు పనీర్‌ తురుము, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-09-02T22:37:25+05:30 IST