పెసరపప్పు సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:48:27+05:30 IST

కావలసిన పదార్థాలు: టమోటాలు - 400 గ్రా., పెసరపప్పు - అర టీ కప్పు, వెన్న - 2 టీ స్పూన్లు

పెసరపప్పు సూప్‌

కావలసిన పదార్థాలు: టమోటాలు - 400 గ్రా., పెసరపప్పు - అర టీ కప్పు, వెన్న - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, మొక్కజొన్నపిండి - 1 టేబుల్‌ స్పూను, పంచదార - 2 టీ స్పూన్లు, గోరువెచ్చనిపాలు - అరకప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, బ్రెడ్‌ ముక్కలు - తగినన్ని.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో తరిగిన టమోటాలు, పెసరపప్పు వేసి 4 కప్పులు నీటిని జతచేసి మెత్తగా ఉడికించి వడకట్టుకోవాలి. కడాయిలో వెన్న కరిగించి ఉల్లి తరుగుని 4 నిమిషాల పాటు వేగించి టమోటో నీటిని జతచేయాలి. ఇందులో మొక్కజొన్న పిండి (అంతకుముందే అరకప్పు నీటిలో ఉండలు చుట్టకుండా కలిపి ఉంచుకోవాలి) వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత పంచదార, పాలు, ఉప్పు, మిరియాలపొడి వేసి అవన్నీ బాగా కలిసేక దించేసి క్రీము, బ్రెడ్‌ ముక్కల్తో వేడివేడిగా సర్వ్‌ చేయండి.

Updated Date - 2015-09-02T22:48:27+05:30 IST