చికెన్‌ మంచూరియా

ABN , First Publish Date - 2015-08-26T22:04:42+05:30 IST

కావలసిన పదార్థాలు : బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు, ఉల్లి, క్యాప్సికం తరుగు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

చికెన్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు : బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు, ఉల్లి, క్యాప్సికం తరుగు, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, మైదా - పావు కప్పు, వెలుల్లి రేకలు - 8, పచ్చిమిర్చి - 8, నూనె - వేగించడానికి, ఉప్పు - రుచికి, కారం - 1 టీ స్పూను, టమోటా కెచప్‌ - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఉప్పు కలిపిన చికెన్‌ గంట పాటు పక్కనుంచాలి. తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్‌ జారులో ముంచి నూనెలో వేగించాలి. 2 టీ స్పూన్లు నూనెలో వెల్లుల్లి, ఉల్లి, క్యాప్సికం, పచ్చిమిర్చి తరుగు దోరగా వేగించి కారం, ఉప్పు, చికెన్‌ ముక్కలు, టమోటా కెచప్‌, సోయా సాస్‌ కలిపి పెద్ద మంటపై 7 నిమిషాలు వేగించాలి. ముక్కలు తేమ పీల్చుకున్న తర్వాత దించేసి తినాలి.

Updated Date - 2015-08-26T22:04:42+05:30 IST