మామిడి బర్ఫీ

ABN , First Publish Date - 2015-09-02T20:35:46+05:30 IST

కావలసినవి: మామిడిగుజ్జు ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు పచ్చికోవా ఒక కప్పు,

మామిడి బర్ఫీ

కావలసినవి: మామిడిగుజ్జు ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు పచ్చికోవా ఒక కప్పు, చక్కెర రెండు కప్పులు, పాలు రెండు కప్పులు, నెయ్యి ఒక టేబుల్‌ స్పూన్‌, కొబ్బరి తురుము రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకల పొడి పావు టీ స్పూను. అలంకరణకు ఆల్మండ్లు, జీడిపప్పురెండు టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం
పాలలో చక్కెర వేసి కాగబెట్టండి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యివేసి బొంబాయి రవ్వను బ్రౌన్‌రంగు వచ్చేదాకా వేగించండి. పాలను, మిగిలిన పదార్థాలను కూడా ఈ రవ్వలో కలిపి సన్నటి సెగమీద చిక్కబడేదాకా తిపతూ ఉండండి. ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కావలసిన షేపులో కట్‌ చేసుకోండి. పైన వేగించిన జీడిపప్పును, ఆల్మండ్లు అలంకరించండి.

Updated Date - 2015-09-02T20:35:46+05:30 IST