వెజిటెబుల్‌ మంచూరియా

ABN , First Publish Date - 2015-08-30T21:38:33+05:30 IST

కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్‌, బీన్స్‌, ఉల్లి కాడలు (తెల్లని భాగం) - 2 కప్పులు,

వెజిటెబుల్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్‌, బీన్స్‌, ఉల్లి కాడలు (తెల్లని భాగం) - 2 కప్పులు, మైదా, కార్న్‌ ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, బియ్యప్పిండి - అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, సోయా సాస్‌ - పావు టీ స్పూను, మిరియాల పొడి - అర టీ స్పూను, వేడి నీరు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
సాస్‌ కోసం: ఉల్లికాడలు - పావు కప్పు, వెల్లుల్లి తరుగు - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - అర టీ స్పూను, కారం (కాశ్మీరీ) - అర టీ స్పూను, సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు, చిల్లీ సాస్‌ - అర టీ స్పూను, వెనిగర్‌- 2 టీ స్పూన్లు, టమోటా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, బ్రౌన్‌ షుగర్‌ - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - తగినంత, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను, తరిగిన కొత్తిమీర/ ఉల్లికాడలు - అలంకరణకు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో కార్న్‌ ఫ్లోర్‌, మైదా, బియ్యప్పిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, సోయా సాస్‌, తరిగిన కూరగాయలు వేసి వేడి నీళ్లు చిలకరిస్తూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని నూనెలో (విడిపోకుండా) దోరగా వేగించి పక్కనుంచాలి. కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల (తెల్ల) తరుగు వేగించాలి. ఇప్పుడు వెజిటెబుల్‌ బాల్స్‌ వేసి 3 నిమిషాల తర్వాత మంట తగించి బ్రౌన్‌ షుగర్‌, సోయా సాస్‌, టమోటా కెచప్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌ ఒకటి తర్వాత ఒకటి కలపాలి. 2 నిమిషాల తర్వాత 4 టేబుల్‌ స్పూన్ల నీరు పోసి పెద్ద మంటపై రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడల తరుగుతో అలంకరించాలి.

Updated Date - 2015-08-30T21:38:33+05:30 IST