బెల్లం రొట్టె

ABN , First Publish Date - 2015-08-30T23:03:01+05:30 IST

కావలసిన పదార్థాలు : బెల్లం - 1 కప్పు, బియ్యప్పిండి - అరకప్పు (ఆరుగంటల సేపు నానబెట్టి, నీళ్లుపిండి ఆరబెట్టాలి) , నీళ్లు - 1 కప్పు, ఎండు కొబ్బరికోరు - అరకప్పు,

బెల్లం రొట్టె

కావలసిన పదార్థాలు : బెల్లం - 1 కప్పు, బియ్యప్పిండి - అరకప్పు (ఆరుగంటల సేపు నానబెట్టి, నీళ్లుపిండి ఆరబెట్టాలి) , నీళ్లు - 1 కప్పు, ఎండు కొబ్బరికోరు - అరకప్పు, నువ్వు లు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, నూనె - 6 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : నువ్వులు, జీడిపప్పు, కొబ్బరికోరు దోరగా వేగించి ఉంచుకోవాలి. ఒక పాత్రలో బెల్లం, నీళ్లు కలిపి బాగా మరగనిచ్చి, వేగించిన నువ్వులు, కొబ్బరి, జీడిపప్పుతో పాటు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి, మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసి మూతపెట్టి, సన్నని సెగమీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్పూనుతో గుచ్చిచూస్తే పిండి అంటుకోకుండా ఉంటే దించేసి ఒక ప్లేటులో బోర్లించి ఐదు నిమిషాలపాటు ఉంచితే రొట్టె ప్లేటులో పడిపోతుంది. దీన్ని ముక్కలుగా కోసి తినండి. పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది 3 రోజుల వరకూ నిలవ కూడా ఉంటుంది.

Updated Date - 2015-08-30T23:03:01+05:30 IST