మిక్స్‌డ్‌ వెజ్‌ మంచూరియా

ABN , First Publish Date - 2015-11-13T14:54:18+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్‌ - చిన్న పువ్వు, క్యాబేజి - పావు చెక్క, క్యారెట్లు - పావుకిలో, ఉప్పు - తగినంత, కార్న్‌ఫ్లోర్‌ - ఒకటిన్నర స్పూను, నూనె - సరిపడా. వెల్లుల్లిపాయ - ఒకటి

మిక్స్‌డ్‌ వెజ్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్‌ - చిన్న పువ్వు, క్యాబేజి - పావు చెక్క, క్యారెట్లు - పావుకిలో, ఉప్పు - తగినంత, కార్న్‌ఫ్లోర్‌ - ఒకటిన్నర స్పూను, నూనె - సరిపడా. వెల్లుల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, క్యాప్సికం - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - ఒక కట్ట, పంచదార- చిటికెడు, మిరియాలపొడి - ఒక టీ స్పూను, ఉల్లికాడలు - రెండు, సోయాసాస్‌ - ఒకటిన్నర స్పూను, నీరు - ఒక కప్పు.

తయారుచేయు విధానం: క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్లను సన్నగా తురుముకోవాలి. ఈ తురుము నుంచి నీరు తీసేయాలి. ఇందులో ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో సరిపడా నూనె పోసి కాగాక వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. సగం వేగాక ఉల్లికాడల ముక్కలు కూడా వేసి ఒక నిమిషం వేయించాలి. తరువాత సోయాసాస్‌, కొద్దిగా నీళ్లు( కూరగాయల తురుము నుంచి పిండిన నీరు) పోసి ఉడికించాలి. మిరియాలపొడి, పంచదార, కొద్దిగా ఉప్పు వేసి కలిపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వెజిటబుల్‌ బాల్స్‌ని కూడా వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే మిక్స్‌డ్‌ వెజ్‌ మంచూరియా తయారయినట్లే.

Updated Date - 2015-11-13T14:54:18+05:30 IST