బేబీకార్న్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-08-30T23:14:25+05:30 IST

కావలసిన పదార్థాలు: బేబీకార్న్‌ - 6, బీన్స్‌, క్యారెట్‌, పచ్చిబఠాణి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లి తరుగు - పావు కప్పు

బేబీకార్న్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: బేబీకార్న్‌ - 6, బీన్స్‌, క్యారెట్‌, పచ్చిబఠాణి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లి తరుగు - పావు కప్పు చొప్పున, చీజ్‌ క్యూబ్స్‌ - 2, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు, నూనె - 1 టేబుల్‌ స్పూను చొప్పున, పంచదార - 1 టీ స్పూను, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 100 మి.లీ.
తయారుచేసే విధానం: బేబీకార్న్‌ తో పాటు ఉల్లి, వెల్లుల్లిని కుక్కర్లో, పచ్చిబఠాణిని విడిగాను ఉడికించాలి. నూనెలో కూరగాయల తరుగు వేగించి, ఉడికించిన బఠాణి, బేబీ కార్న్‌ ముక్కలు (ఉడికించిన నీళ్లతో పాటు) వేసి, మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి, పంచదార కలపాలి. నిమిషం తర్వాత చీజ్‌ క్యూబ్స్‌ కలిపి మంట తీసేయాలి. కొత్తిమీరతో అలంకరించి తాగాలి.

Updated Date - 2015-08-30T23:14:25+05:30 IST