కాల్చిన మొక్కజొన్న సలాడ్‌

ABN , First Publish Date - 2019-03-23T20:59:53+05:30 IST

కాల్చిన (కొద్దిగా మాడిన) మొక్కజొన్న పొత్తులు- ఆరు, తరిగిన ఉల్లిపాయ- పెద్దది, సన్నగా తరిగిన..

కాల్చిన మొక్కజొన్న సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
కాల్చిన (కొద్దిగా మాడిన) మొక్కజొన్న పొత్తులు- ఆరు, తరిగిన ఉల్లిపాయ- పెద్దది, సన్నగా తరిగిన మిరపకాయ- ఒకటి, నిమ్మరసం - కొద్దిగా, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత, నల్ల మిరియాల పొడి- చిటికెడు, తరిగిన కొత్తిమీర- ఒక కప్పు
 
తయారీవిధానం
 
ముందుగా మొక్కజొన్న పొత్తులను (కార్న్‌) బాగా కాల్చిన తర్వాత వాటిని ఒలిచి, గిన్నెలో ఉంచుకోవాలి. ఒక గిన్నెలో ఆలివ్‌ ఆయిల్‌ పోసి కొద్దిగా వేడిచేయాలి. తర్వాత అందులో మిర్చి, ఉల్లిపాయ, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేడి కాగానే ఆ మిశ్రమంలో కార్న్‌ వేయాలి. చల్లారాక ఈ సలాడ్‌పై కొద్దిగా కొత్తిమీర చల్లి తింటే రుచిగా ఉండటమే గాక శరీరానికి కావాల్సినంత బలాన్నిస్తుంది.

Updated Date - 2019-03-23T20:59:53+05:30 IST