నోరూరించే నాటుకోడి పులుసు..

ABN , First Publish Date - 2018-06-16T18:57:28+05:30 IST

నాటుకోడి చికెన్‌, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు...

నోరూరించే నాటుకోడి పులుసు..

కావలసిన పదార్థాలు
నాటుకోడి చికెన్‌, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు, ధనియాలు, జిలకర పొడి, గరం మాసాల, కొత్తిమీర.
 
తయారు చేయు విధానం
నాటుకోడి పులుసు తయారీకి 10 నిమిషాల ముందు ముక్కలకు కారం, ఉప్పు పట్టించాలి. నూనె వేడికాగానే ఉల్లిపాయలు వేయాలి. మాడకాగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టు వేయాలి. అనంతరం కలిపిన చికెన్‌ ముక్కలను మూకుడులో వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత నీళ్లుపోసి ఉడికించాలి. చికెన్‌ ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. ధనియాల పొడి, జిలకర పొడి, గరం మాసాల వేయాలి. దించే ముందుగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. నోరూరించే నాటుకోడి పులుసు రెడీ.

Updated Date - 2018-06-16T18:57:28+05:30 IST