చికెన్‌ ప్యాకెట్‌

ABN , First Publish Date - 2018-07-14T20:39:02+05:30 IST

బ్రెడ్‌స్లైసె్‌స-ఆరు, కోటింగ్‌ కోసం: గుడ్డు-ఒకటి, బ్రెడ్‌ క్రంబ్స్‌, పెప్పర్‌, చిల్లీ ఫ్లేక్స్‌- సరిపడా (ఇష్టమైతే), నూనె...

చికెన్‌ ప్యాకెట్‌

కావలసినవి
 
బ్రెడ్‌స్లైసె్‌స-ఆరు, కోటింగ్‌ కోసం: గుడ్డు-ఒకటి, బ్రెడ్‌ క్రంబ్స్‌, పెప్పర్‌, చిల్లీ ఫ్లేక్స్‌- సరిపడా (ఇష్టమైతే), నూనె (వేగించడానికి సరిపడా). ఫిల్లింగ్‌ పదార్థాలు: చికెన్‌-పావుకిలో, క్యారెట్‌-ఒకటి (సన్నగా తరిగి), కాప్సికం-ఒకటి (సన్నటిముక్కలుగా తరిగి), క్యాబేజీ- పావుకిలో (తురిమినది), మొక్కజొన్నలు (ఉడకబెట్టి, కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసి), వెన్న లేదా నూనె- రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్టు-రెండు టీస్పూన్లు, మయొనై్‌స-మూడు టేబుల్‌స్పూన్లు, పసుపు- అర టీస్పూను, మిరియాలు- అర టీస్పూను, ఉప్పు-తగినంత.
 
తయారీ
 
బ్రెడ్‌ని చపాతీకర్రతో కొద్దిగా ఒత్తి కట్టర్‌తో బ్రెడ్‌ను గుండ్రంగా కట్‌ చేయాలి. ఒక బ్రెడ్‌ మీద మరొక బ్రెడ్‌ పెట్టాలి. బ్రెడ్‌ అంచులను నీళ్ల తడితో ముడవాలి. గిలక్కొట్టిన గుడ్డు మిశ్రమంలో బ్రెడ్‌ స్లైస్‌ను ముంచి చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాలపొడి కలిపిన బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించాలి. ఆ తర్వాత నూనెలో బంగారువర్ణం వచ్చేదాకా వాటిని వేగించాలి.
చల్లారాక గుండ్రంగా ఉన్న బ్రెడ్‌ను సగానికి (సెమీసర్కిల్‌ షేప్‌లో) కట్‌ చేయాలి.
సెమీ సర్కిల్‌ షేపులో పాకెట్‌లా ఉన్న బ్రెడ్‌లో ఫిల్లింగ్‌ చేయాలి.
 
ఫిల్లింగ్‌ తయారీ
ఉప్పు, పసుపు, మిరియాలపొడి వేసి చికెన్‌ని ఉడకబెట్టి సన్నటి ముక్కలుగా చేయాలి.
పాన్‌లో వెన్న లేదా నూనె వేసి క్యారెట్‌, కాప్సికం ముక్కలు, క్యాబేజీ తరుగు వేగించి దానిపై ఉప్పు చల్లాలి. దాంట్లో మొక్కజొన్నలు, పచ్చిమిర్చి పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకూ వేగించి కిందకు దించాలి. చల్లారిన ఈ మిశ్రమంలో చికెన్‌ముక్కలు, మయొనైస్‌ వేసి కలపాలి. ఫిల్లింగ్‌ మిశ్రమం రెడీ. దీన్ని బ్రెడ్‌ ప్యాకెట్స్‌లో నింపాలి. టొమాటో సాస్‌తో వీటిని తింటే బాగుంటాయి.

Updated Date - 2018-07-14T20:39:02+05:30 IST