చింతకాయ చికెన్‌

ABN , First Publish Date - 2018-01-27T23:32:20+05:30 IST

చికెన్‌- అరకిలో, టొమాటో- ఒకటి (పెద్దది, సన్నగా తరిగి), ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగి...

చింతకాయ చికెన్‌

కావలసినవి
 
చికెన్‌- అరకిలో, టొమాటో- ఒకటి (పెద్దది, సన్నగా తరిగి), ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగి), పచ్చిమిర్చి -ఎనిమిది (చిన్నముక్కలు), పచ్చిచింతకాయ గుజ్జు- ఐదు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు, లవంగాల పొడి- ఒక్కొక్కటి పావు టీస్పూను చొప్పున, కారం- అరటేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, నూనె- తగినంత, కొత్తిమీర- సరిపడా.
 
తయారీవిధానం
 
పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేగించాలి. తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి. సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చిచింతకాయ గుజ్జు ఈ మిశ్రమంలో వేసి ఒక కప్పు నీళ్లు కూడా పోయాలి. తర్వాత చికెన్‌ ముక్కలు వేసి బాగా కలిపి, కూరలోని నీళ్లు ఆవిరయ్యేంతవరకూ సన్నని మంటపై ఉడికించాలి.
కూర రంగు మారేవరకు స్టవ్‌ మీద ఉంచాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లాలి. వేడి వేడి అన్నంతో ఈ కూరను తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-01-27T23:32:20+05:30 IST