వెజిటబుల్ ఎగ్‌కేక్

ABN , First Publish Date - 2017-02-25T19:08:30+05:30 IST

గుడ్లు- 8, ఉల్లిపాయ- ఒకటి (గుండ్రంగా కోసుకోవాలి), బ్రెడ్‌ తురుము- పావు కప్పు,

వెజిటబుల్ ఎగ్‌కేక్

కావలసిన పదార్థాలు
గుడ్లు- 8, ఉల్లిపాయ- ఒకటి (గుండ్రంగా కోసుకోవాలి), బ్రెడ్‌ తురుము- పావు కప్పు, క్యారెట్‌, ఆలుగడ్డ- ఒక్కోటి చొప్పున (సన్నగా కోసి ఉడికించి ఉంచుకోవాలి), టమోటాలు- రెండు (గుండ్రంగా కోసుకోవాలి), కొత్తిమీర- కొద్దిగా, కారం- ఒక టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు- మూడు, చెర్రీ పండ్లు- కొన్ని, గరం మసాలా- పావు టీ స్పూను, నూనె- ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
ఒక గిన్నెలో గుడ్లు, బ్రెడ్‌ తురుము, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బాణలికి చుట్టూ నూనె రాసి కొద్దిగా గుడ్ల మిశ్రమం పోసి పైన క్యారెట్‌, ఉల్లిపాయ, ఆలుగడ్డ వేయాలి. తర్వాత దాని పైన మళ్లీ కొంచెం గుడ్ల మిశ్రమాన్ని పోసి, పైన చెర్రీ పండ్లు, టమోటా ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు పేర్చాలి. ఇలా పొరలు పొరలుగా వరుసగా పేర్చుకున్నాక కుక్కర్‌లో పెట్టి ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించి దించాలి.

Updated Date - 2017-02-25T19:08:30+05:30 IST