మీల్ మేకర్ ఎగ్‌‌కర్రీ

ABN , First Publish Date - 2016-09-19T17:00:05+05:30 IST

ఉడకబెట్టిన కోడిగుడ్లు- రెండు, మీల్‌ మేకర్‌- అర కప్పు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చికొబ్బరి తురుము- ఒక టేబుల్‌ స్పూను, ఇంగువ-

మీల్ మేకర్ ఎగ్‌‌కర్రీ

కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు- రెండు, మీల్‌ మేకర్‌- అర కప్పు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చికొబ్బరి తురుము- ఒక టేబుల్‌ స్పూను, ఇంగువ- చిటికెడు, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత, తరిగిన కొత్తిమీర- ఒక టేబుల్‌ స్పూను, నీళ్లు- తగినన్ని.

 
గ్రేవీ కోసం: తరిగిన ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- అర టేబుల్‌ స్పూను, లవంగాలు- రెండు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, సోంపు- ఒక టీ స్పూను, జాపత్రి- ఒకటి, కారం- ఒక టీ స్పూను, పసుపు- అర టీ స్పూను, దనియాల పొడి- రెండు టీ స్పూన్లు,
 
తయారీ విధానం: వేడినీటిలో మీల్‌ మేకర్‌ని వేసి పది
నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని మొత్తం చేతులతో పిండేసి రెండు నిమిషాలు ఆరనివ్వాలి. గ్రేవీ కోసం తీసుకున్న పదార్థాలన్నిటినీ తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వేగించాలి. తర్వాత కొబ్బరి తురుము, మీల్‌ మేకర్‌, ఉప్పు, ఇంగువ, గ్రేవీ ముద్ద కూడా వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత కోడిగుడ్లు వేసి, నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడికించాలి.

Updated Date - 2016-09-19T17:00:05+05:30 IST