గుమ్మడిగింజల హల్వా

ABN , First Publish Date - 2015-09-01T23:21:15+05:30 IST

కావలసిన పదార్థాలు: గుమ్మడి గింజలు - 250 గ్రా., తాటిబెల్లం - 200 గ్రా.,

గుమ్మడిగింజల హల్వా

కావలసిన పదార్థాలు: గుమ్మడి గింజలు - 250 గ్రా., తాటిబెల్లం - 200 గ్రా., ఎండుకొబ్బరికోరు - 10 గ్రా., యాలకులు - 5 గ్రా., కొబ్బరిపాలు (చిక్కనివి) - 200 మి.లీ., నెయ్యి - 20 గ్రా.
తయారుచేసే విధానం: ముందుగా గుమ్మడి గింజల్ని గోరువెచ్చని నీటిలో అరగంటపాటు నానబెట్టి తొక్కలు తీసి పక్కనుంచుకోవాలి. తాటిబెల్లం పొయ్యి మీద పెట్టి ముదురుపాకం వచ్చాక కొబ్బరిపాలు, గుమ్మడి గింజలు వేసి సన్నటి సెగ మీద ఐదు నిమిషాలు ఉంచాలి. యాలకులపొడి వేసి దించేయూలి. నెయ్యిలో దోరగా వేగించిన కొబ్బరిని హల్వాపైన అలంకరించుకోవాలి.

Updated Date - 2015-09-01T23:21:15+05:30 IST