రేగిపట్టీ

ABN , First Publish Date - 2016-12-19T20:32:48+05:30 IST

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- రెండు కప్పులు, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, చక్కెర

రేగిపట్టీ

కావలసిన పదార్థాలు
రేగిపండ్లు- రెండు కప్పులు, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, చక్కెర- ఆరు టీ స్పూన్లు, బాదం, జీడిపప్పు- చెరో టీ స్పూను.
 
తయారీ విధానం
రేగిపండ్లలో విత్తనాలను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నెయ్యి పోసి వేడెక్కాక రేగి పండ్ల ముక్కలను వేసి 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత చక్కెర, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు కూడా వేయాలి. చక్కెర పూర్తిగా కరిగేదాకా వేగించి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేటులో సమానంగా పోసి చల్లార్చిన తర్వాత ముక్కలుగా కత్తిరించుకోవాలి.

Updated Date - 2016-12-19T20:32:48+05:30 IST