పన్నీర్‌ పిజ్జా

ABN , First Publish Date - 2017-09-16T19:58:12+05:30 IST

పన్నీర్‌ ముక్కలు - 100 గ్రాములు, పిజ్జా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా..

పన్నీర్‌ పిజ్జా

కావలసిన పదార్థాలు
 
పన్నీర్‌ ముక్కలు - 100 గ్రాములు, పిజ్జా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా, నూనె - వేపుడుకు సరిపడా, తులసి ఆకులు - 4 (సన్నగా తరగాలి), మెజెరెల్లా చీజ్‌ - తగినంత, గోధుమ పిండి - 2 కప్పులు, నూనె - సరిపడా, పాలు - అర కప్పు, మిరియాల పొడి - 1 టీస్పూను.
తయారీ విధానం
 
గోధుమ పిండికి పాలు చేర్చి మెత్తగా పిసుక్కోవాలి. ముద్దను సమ భాగాలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి. ఈ పరోటాను పీట మీద ఉంచి పైన పిజ్జా సాస్‌ పరుచుకుని, పన్నీర్‌, మోజెరెల్లా చిలకరించాలి. ఉప్పు, తులసి ఆకులు, మిరియాల పొడి చల్లి అంచులు నీళ్లతో తడి చేసుకోవాలి. దీని మీద మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వేడిగా పుదీనా చట్నీతో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-09-16T19:58:12+05:30 IST