మసాలా సోడా

ABN , First Publish Date - 2018-04-30T16:39:58+05:30 IST

పంచదార పాకం - ఆరు పెద్ద టీస్పూన్లు, నిమ్మ కాయ - ఒకటి (రసం తీసి), నల్ల మిరియాల పొడి..

మసాలా సోడా

కావలసినవి
 
పంచదార పాకం - ఆరు పెద్ద టీస్పూన్లు, నిమ్మ కాయ - ఒకటి (రసం తీసి), నల్ల మిరియాల పొడి - పావు టేబుల్‌ స్పూన్‌, చాట్‌ మసాలా - రెండు టీస్పూన్లు, బ్లాక్‌ సాల్ట్‌ - అర టేబుల్‌ స్పూన్‌, క్రష్డ్‌ ఐస్‌, సోడా నీళ్లు, పొడవాటి గ్లాసు, నిమ్మ చెక్క - అలంకరణకు.
 
తయారీవిధానం
 
క్రష్డ్‌ ఐస్‌ తప్ప మిగతా అన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. పిచర్‌ ఉంటే అందులో వేసి, మూతపెట్టి ఒక నిమిషం కలపాలి.  క్రష్ట్‌ ఐస్‌ ఎక్కువగా వేసి బాగా షేక్‌ చేయాలి.
దీన్ని సర్వింగ్‌ గ్లాస్‌లో వేసి తరువాత సోడా పోయాలి. నిమ్మ చెక్కతో అలంకరించి తాగేయాలి. వేసవి వేడిని బీట్‌ చేయాలంటే ఈ డ్రింక్‌ తాగాల్సిందే మరి.

Updated Date - 2018-04-30T16:39:58+05:30 IST