పచ్చిమామిడి షర్బత్

ABN , First Publish Date - 2016-04-16T02:43:58+05:30 IST

కావలసినవి: పచ్చిమామిడికాయ - ఒకటి, అరటిపండు - ఒకటి, పంచదార - అరకప్పు, జీలకర్రపొడి - అర టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి - అరటేబుల్‌ స్పూన్‌, ఉప్పు - తగినంత.

పచ్చిమామిడి షర్బత్

కావలసినవి: పచ్చిమామిడికాయ - ఒకటి, అరటిపండు - ఒకటి, పంచదార - అరకప్పు, జీలకర్రపొడి - అర టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి - అరటేబుల్‌ స్పూన్‌, ఉప్పు - తగినంత.

తయారీ
: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత మామిడికాయ తొక్క తీసి ముక్కలు కోయడం లేదా తురమడం చేయాలి. కోసిన ముక్కలు, పంచదార కలిపి మిక్సీజార్‌లో వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి. ఈ గుజ్జులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ జ్యూస్‌ని గ్లాసులోకి వడపోసి అరటిపండు ముక్కలు వేయాలి. పైన జీలకర్ర, మిరియాల పొడి, ఐస్‌ ముక్కలు వేస్తే మామిడి షర్బత్ రెడీ. ఈ షర్బత్‌తో డి-హైడ్రేషన్‌ సమస్యను నివారించొచ్చు.

Updated Date - 2016-04-16T02:43:58+05:30 IST