వెల్లుల్లీ మ్యాగీ నూడుల్స్

ABN , First Publish Date - 2017-03-18T22:02:05+05:30 IST

కావలసిన పదార్థాలు మ్యాగీ నూడుల్స్‌- నాలుగుండే పెద్ద ప్యాకెట్‌, వెల్లుల్లి రెబ్బలు- పది, తరిగిన ఉల్లిపాయ-

వెల్లుల్లీ మ్యాగీ నూడుల్స్

కావలసిన పదార్థాలు

మ్యాగీ నూడుల్స్‌- నాలుగుండే పెద్ద ప్యాకెట్‌, వెల్లుల్లి రెబ్బలు- పది, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, గుడ్లు- మూడు, పచ్చిమిర్చి- ఒకటి, అల్లం తురుము- ఒక టీ స్పూను, ఉప్పు, కారం- ఒక్కో టీ స్పూను చొప్పున, చిల్లీసాస్‌- ఒక టీ స్పూను, నూనె- ఒకటిన్నర టేబుల్‌ స్పూను.

తయారీ విధానం
మ్యాగీ నూడుల్స్‌ను సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు పగలకొట్టి ఉప్పు, కారం, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారురంగు వచ్చేదాకా వేగించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిల్లీసాస్‌ వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత గుడ్ల మిశ్రమం, మ్యాగీ నూడుల్స్‌ కూడా వేసి చిన్న మంట మీద నిమిషం పాటు వేగించి దించేయాలి.

Updated Date - 2017-03-18T22:02:05+05:30 IST