ఎగ్‌ బుర్జీ

ABN , First Publish Date - 2015-09-01T17:24:53+05:30 IST

కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు, టమోటో - 1, ఉల్లితరుగు - 1 కప్పు, అల్లం తరుగు

ఎగ్‌ బుర్జీ

కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు, టమోటో - 1, ఉల్లితరుగు - 1 కప్పు, అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి -1, కారం - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్‌ స్పూను, పసుపు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి ఉల్లి, అల్లం, టమేటో తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగాక పసుపు, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత గుడ్డు కొట్టి బాగా కలపాలి. గుడ్డుపొడిగా ఆయ్యాక కొబ్బరికోరు వేసి సన్నని మంటపై మరో 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
ఈ బుర్జీలో ఇష్టమున్నవాళ్లు కొబ్బరి బదులు 1 టేబుల్‌ స్పూను పాలు కూడా పోసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా (టిఫిన్‌లా) తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T17:24:53+05:30 IST