చింతకాయ-రొయ్యలు

ABN , First Publish Date - 2015-11-21T16:52:57+05:30 IST

కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - అరకిలో, చింతకాయ ముక్కలు - 100 గ్రాములు, ఉల్లిపాయముక్కలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, గరం మసాల - ఒక

చింతకాయ-రొయ్యలు

కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - అరకిలో, చింతకాయ ముక్కలు - 100 గ్రాములు, ఉల్లిపాయముక్కలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, గరం మసాల - ఒక టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేత చింతకాయ ముక్కల్ని రోట్లో దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, రొయ్యల్ని కూడా వేసి కలపాలి. ఓ పది నిమిషాలు సన్నని మంటపై మగ్గాక దంచి పెట్టుకున్న చింతకాయ ముద్దను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరంమసాలా వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-11-21T16:52:57+05:30 IST