రొయ్యల పకోడి

ABN , First Publish Date - 2015-09-01T20:56:58+05:30 IST

కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన చిన్న రొయ్యలు - అరకేజి, ఉల్లి తరుగు - కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు

రొయ్యల పకోడి

కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన చిన్న రొయ్యలు - అరకేజి, ఉల్లి తరుగు - కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, శనగపిండి - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, గరం మసాల - పావు టీ స్పూను, కరివేపాకు - గుప్పెడు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌స్పూను, వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కారం - అర టీ స్పూను, చాట్‌ మసాల - అర టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, గరం మసాల, వంటసోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, శనగపిండితో పాటు రొయ్యలు ఒక పాత్రలో వేసి (అవసరమైతే కొద్ది నీరు చల్లుకుని) బాగా కలిపి అరగంట పక్కనుంచాలి. తర్వాత నూనెలో పకోడీల్లా వేస్తూ దోరగా వేగించాలి. బాగా వేగాక చాట్‌ మసాలా చల్లి వేడివేడిగా తినాలి.

Updated Date - 2015-09-01T20:56:58+05:30 IST