దానిమ్మకాయ, బెల్లం జామ్
ABN , First Publish Date - 2015-08-30T19:05:42+05:30 IST
కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, నీరు - 1 కప్పు
కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, నీరు - 1 కప్పు.
తయారుచేసే విధానం: దానిమ్మ గింజలను మిక్సీలో తిప్పి సన్నటి బట్టలో వడకట్టాలి. వచ్చిన రసం 2 కప్పుల కొలతగా తీసుకోవాలి. ఈ రసంలో బెల్లం తురుము, నీరు కలిపి సన్నని మంటపై సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. తీగపాకం రాగానే మంట తీసేసి, జామ్ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక గాజు జాడీలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ జామ్ బ్రెడ్, పాన్‌కేక్స్, చపాతీలతో బాగుంటుంది.