క్యారెట్‌, టమోటా పచ్చడి

ABN , First Publish Date - 2015-08-30T20:40:51+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ (పెద్దది) - 1, టమోటాలు - 2, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి - 4 రేకలు, పంచదార

క్యారెట్‌, టమోటా పచ్చడి

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ (పెద్దది) - 1, టమోటాలు - 2, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి - 4 రేకలు, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు, తాలింపు కోసం: ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: కొద్ది నూనెలో పెద్ద ముక్కలుగా తరిగిన క్యారెట్‌, టమోటాలతో పాటు చిదిమిన పచ్చిమిర్చి సన్నటి మంటపై మగ్గించాలి. చల్లారిన తర్వాత వెల్లుల్లి, పంచదార, ఉప్పుతో పాటు గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత తాలింపు కలపాలి. 

Updated Date - 2015-08-30T20:40:51+05:30 IST